![]() |
![]() |

జబర్దస్త్ ఎప్పటిలాగే ఈ వారం కూడా ఆడియన్స్ ని నవ్వించింది. ఇక ఇందులో రాకింగ్ రాకేష్ స్కిట్ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. రాకేష్ కొంత స్థలం కొనడం అందులో ఆయన గురువు ధనరాజ్ వాళ్లకు వీళ్లకు అంటూ మొత్తం స్వాహా చేయించేస్తాడు. చివరికి సుజాత తిట్లు ఫుల్ గ నవ్వించింది. తర్వాత రాకేష్ ధనరాజ్ కాళ్ళు కడిగాడు. "ఏ బంధం లేకుండా ఒక్క గురుశిష్యుల బంధం మాత్రమే ఇక్కడి వరకు నిలబడింది అంటే జబర్దస్త్ వల్లనే. ఈరోజున నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన గైడెన్స్ ఇస్తూ తండ్రిలా, గురువులా ఈ స్తానం వరకు తీసుకొచ్చారు. 12 ఏళ్ళ జర్నీని చూసాక ఆ కార్యక్రమంలో నేను లేను అనే బాధ ఉంది.
అందులో నేను చేయలేనిది ఇప్పుడు చేయాలనుకుంటున్న" అని చెప్పి రాకేష్, సుజాత ఇద్దరూ కలిసి ధనరాజ్ కాళ్ళు కడిగారు. "రాకేష్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంతవరకు వచ్చాడు. రాకింగ్ రాకేష్ అంటే ఇప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ఫొటోస్ దిగుతున్నారంటే చాల సంతోషంగా ఉంది. ఒక బిడ్డను కన్నప్పుడు తల్లి ఎంత ఆనందపడుతుందో నేను అంత కంటే ఎక్కువగా ఆనందపడుతున్నాను. దేవుడిచ్చిన మరదలు. నాకు ఇద్దరు కొడుకులు. రాకేష్ నాకు మూడో కొడుకు..నాకు దేవుడిచ్చిన మరదలు ఒక రోజు నాతో అంది కడుపుతో ఉన్నప్పుడు నేను తినాలనుకున్నవి తినలేకపోయాను ఆ కోరికలు అలాగే ఉండిపోయాయి అంటే ఒకరోజు ఇంటికి పిలిచి తాను ఏమేమి తినాలనుకున్నదో అవన్నీ నేను ఒక్కడినే వండిపెట్టి భోజనం పెట్టాను. నా ఇల్లు రాకేష్ ఇల్లు అంటూ ఏమీ లేదు. ఆస్తి పంపకాలప్పుడు మాత్రమే వర్తించదు అంతే" అంటూ ధనరాజ్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |